Home Page SliderNational

కర్ణాటకలో “వికసిత్ యువ -వికసిత్ భారత్”

ప్రతీ సంవత్సరం మనం జనవరి 12వతేదీన స్వామి వివేకానంద జన్మదినం సందర్బంగా జాతీయ యువజనోత్సవం జరుపుకుంటాము. శ్రీ స్వామి వివేకానంద దేశ యువశక్తిని ప్రపంచానికి తెలియజేశాడు.  కర్ణాటక ప్రభుత్వం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సహకారంతో 26 వ యూత్ ఫెస్టివల్‌ను జరుపుతోంది. ఈ కార్యక్రమానికి వికసిత్ యువ వికసిత్ భారత్ అని పేరు పెట్టింది. ఇది జనవరి 12 నుండి జనవరి 16 వరకూ నాలుగు రోజుల పాటు ధార్వాడ్‌లోని హుబ్బల్లిలో జరుగుతుంది. . ఈ రోజును పునస్కరించుకుని ప్రధాని కర్ణాటకలోని నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు.

ప్రధాని మోదీ శ్రీ స్వామి వివేకానందుని 160 వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఆయన గొప్ప ఆధ్యాత్మిక, సామాజిక సృహను కొనియాడారు. వివేకానందుని ఆలోచనలు, ఆయన ప్రసంగాలు భారతదేశానికి ప్రపంచదేశాలలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయన్నారు. వివేకానందుని దేశభక్తి, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చింతన, పనిలో నిబద్ధత, తనను ఎల్లప్పుడూ ఉత్తేజపరుస్తాయని, ఆయన తనకెప్పుడూ ఒక రోల్ మోడల్ అని ప్రధాని పేర్కొన్నారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్వామీజీకి నివాళులర్పిస్తూ ఆయన ఆధ్యాత్మికతలో దేశభక్తిని రంగరించి, యువతరానికి ఆదర్శంగా నిలిచారన్నారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర యువతకు  తమ కలలను, ఆశలను నిజం చేసుకోగలిగే స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.