ప్రధాని నాకేం పనిష్మెంట్ ఇవ్వలేదు
ప్రధాని మోదీజీ తనకు పనిష్మెంట్ ఇవ్వలేదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. నిన్న ఆయన్ను న్యాయశాఖామంత్రిగా తప్పించి ఎర్త్ అండ్ సైన్సెస్ మంత్రిగా నియమించారు. దీనితో కిరణ్ పనితీరు బాగోలేదని, అందుకే ప్రధాని ఆయన్ను ఆ పదవి నుండి తప్పించి ప్రాధాన్యత లేని శాఖను అప్పగించారని, పలువురు వ్యాఖ్యానించారు. అనేక మీడియాలలో కథనాలు రావడంతో ఈ వివరణ ఇచ్చారు మంత్రి కిరణ్ రిజిజు. ప్రధాని విజన్ ఎంతో ఉన్నతంగా ఉంటుందని, ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే ఈ మార్పులు తెచ్చారని ఆయన వివరించారు. గతంలో క్రీడాశాఖ మంత్రిగా కూడా కిరణ్ పని చేశారు. దీనితో ఆయన తనకు ప్రధానిపై ఎలాంటి అనుమానమూ లేదని నమ్మకంగా చెప్పారు.