నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుదల
నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పప్పులు, బియ్యం, ఉల్లిగడ్డలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. క్రితం ఏడాదితో పోలిస్తే వీటి ధరలు గణనీయంగా పెరగడంతో ఇంటి ఖర్చులపై ప్రభావం తీవ్రంగా చూపుతోంది. ఏడాదిలో కందిపప్పు ధర దాదాపు రూ.50 శాతం పెరిగింది.. బియ్యం 13-15 శాతం పెరిగింది. సన్నబియ్యానికి పెంచిన మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఆహార పంటలసాగు తగ్గడం, వర్షాభావ పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేకపోవడం కారణాలుగా చెప్పవచ్చు.