రికార్డు స్థాయికి చేరిన కోడి గుడ్డు ధర
మార్కెట్‌లో నిన్నటివరకు మాములు ధర పలికిన కోడి గుడ్డు ఒక్కసారిగా రికార్డు స్థాయికి చేరింది. కాగా నిన్నటితో కార్తీక మాసం ముగియడం,చలికాలం కావడంతో కోడి గుడ్డు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ మేరకు ఇవాళ విశాఖ మార్కెట్‌లో 100 గుడ్ల ధర రూ.580గా ఉంది. మరోవైపు విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో రూ.584గా ఉన్నట్లు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ వెల్లడించింది. అయితే ఈ రేటు ఆల్ టైమ్ రికార్డు అని అధికారులు చెబుతున్నారు.కాగా రిటైల్‌లో ఒక్కో గుడ్డును రూ.6.50-7కు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ధరలే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.