గత పాలకులు అమరావతి– తుళ్లూరు రోడ్డు వేయలేకపోయారు
రాష్ట్రవ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, నాడు–నేడు ద్వారా మా నియోజకవర్గానికి సుమారు రూ.257 కోట్లు సీఎం జగన్ ద్వారా మాకు అందాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఇందులో కనీసం నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. గత పాలకులు అమరావతి నుంచి తుళ్లూరుకు రోడ్డు వేయలేకపోయారని ఎమ్మెల్యే శంకర్‌రావు విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాకే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే అన్నారు.