పోచంపల్లి నేత కార్మికులను చూసి ఎంతో సంతోషించా..రాష్ట్రపతి
తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పోచంపల్లి చేనేత కార్మికులను కలుసుకున్నారు. వారిని చూసి చాలా సంతోషం కలిగిందని, పోచంపల్లి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. చేనేత కళను భావితరాలకు అందిస్తున్న వారి కృషి అభినందనీయమన్నారు. ఈ పర్యటనలో భాగంగా చేనేత మగ్గాలను, టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ చేనేత కళ విభిన్నమైనదని, ఫ్యాషన్ రంగంలో కూడా పోచంపల్లి చేనేత కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వారి సలహాలను పరిగణనలోకి తీసుకుని పోచంపల్లి అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.


