పోలీసులు.. అధికార పార్టీకి తొత్తులుగా మారారు
మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరించవద్దని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆయన మీడియా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గోదావరిఖని, నస్పూర్, మంచిర్యాల కేంద్రాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. ఓటు వేసిన ఓటర్లు బాహాటంగా బీజేపీ గెలుస్తుందని చెబుతుండడంతో ఓటమిని ఒప్పుకోలేని కాంగ్రెస్ నాయకులు గందరగోళం సృష్టించాలని ఉద్దేశంతో.. పోలీసుల సాయంతో నస్పూర్ లో సుగుణాకర్ ఎస్ఐ బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేయడం తోపాటు పోలీస్ స్టేషన్ కు తరలించడం మంచిది కాదని ఆయన అన్నారు. అదేవిధంగా గోదావరిఖనిలో న్యాయవాదులు బీజేపీకి మద్దతుగా ఉండడంపై గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి న్యాయమూర్తులతో దురుసుగా వ్యవహరించడం పై ఆయన మండిపడ్డారు. అధికార పార్టీ అండదండలతో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పట్టబద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుస్తున్నారన్నారు.

