మాజీ సీఎం జగన్‌కు భద్రతపై పోలీస్ శాఖ క్లారిటీ
మాజీ సీఎం జగన్‌కు భద్రత లేదని, ఆయన ఫిట్‌నెస్ లేని వాహనాన్ని ఇచ్చారని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ స్పందించింది. జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని, జగన్ వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని పేర్కొంది. వినుకొండ పర్యటన నిమిత్తం ఆయనకు భద్రత తగ్గించారని, పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపించారు.ఈ వాహనం ఈ ప్రయాణంలో పలుమార్లు మొరాయించిందని సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టారు. ఈ ఆరోపణలను పోలీస్ శాఖ, ప్రభుత్వం ఖండించాయి. జగన్ వాహనం కండిషన్ చూసిన తర్వాతే వీఐపీకి ఇచ్చే వాహనమే ఆయనకు కేటాయించినట్లు తెలిపారు. ఆయన వెంట వచ్చిన వాహనాలను కూడా ఎవ్వరూ అడ్డుకోలేదని తెలిపింది. కేవలం ర్యాలీలు, సభలకు ప్రస్తుతం అనుమతి లేదని పేర్కొంది. జగన్ పరామర్శ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

