Home Page SliderNational

శుక్రవారం భారత్ బంద్.. ముందు జాగ్రత్తగా కూంబింగ్ చేపట్టిన పోలీసులు

డిసెంబర్ 22న (శుక్రవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు. జార్ఖండ్, బీహార్ ఇతర రాష్ట్రాల్లో విప్లవోద్యమాన్ని కేంద్రం అణచివేయడానికి నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని ఛత్తీస్‌గఢ్ సహా పలుచోట్ల మావోలు బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు పంచుతున్నారు, గోడలమీద అతికిస్తున్నారు. దీంతో ఎఓబీ సహా దండకారణ్యంలో భద్రతాబలగాలు హైఅలెర్ట్ ప్రకటించి ముందు జాగ్రత్తగా కూంబింగ్ చేపట్టాయి.