గులాబీ పార్టీ కాంగ్రెస్ లో కలవడం ఖాయం..
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో కలువడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు బాగా లేక ఆ పార్టీ హస్తం పార్టీలో వీలినమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం వెళ్లి సోనియా గాంధీని కలిసిన మాట వాస్తవం కాదా అని 2014లోనే ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావాల్సిన ఉన్నా.. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యం కాలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ విలీనానికి కేసీఆర్ కుటుంబంలో కలహాలు కూడా అందుకు అనుకూలంగా మారాయని చెప్పుకొచ్చారు.