NationalNews

డ్రగ్స్‌ టెస్టులో పైలట్‌ విఫలం..

పైలట్లకు డ్రగ్స్ టెస్టు పరీక్షల అమలు ఈ ఏడాది జనవరి 31న ప్రారంభమైంది. తాజాగా ఈ నెల 23న డ్రగ్స్ పరీక్ష ఫలితాలు రాగా.. ఓ పైలట్ డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షలో అక్రమ ఔషధానికి సంబంధించిన పదార్థం కనుగొనబడింది. మరోవైపు మరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించి విధుల నుంచి కూడా తొలగించారు. ఇప్పటివరకు నలుగురు పైలట్లు మరియు ఒక ATC అధికారి ఈ పరీక్షలో విఫలమయ్యారు. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు DGCA డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. డ్రగ్స్‌ టెస్ట్‌లో విఫలమైన వారిని ఫ్లైట్ డ్యూటీ నుండి డిస్మిస్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) శుక్రవారం ప్రకటించింది.  

డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన విమాన సిబ్బందిని ముందుగా డ్రగ్స్‌ రిహాబ్ సెంటర్‌కు పంపుతారు. యూరిన్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో అక్రమ ఔషధానికి సంబంధించిన పదార్థం కనుగొనబడింది. నెంటనే ఆయన్ను విధుల నుండి తొలగించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆ పైలట్ పనిచేస్తున్నారు. మరోవైపు మరో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించి విధుల నుంచి కూడా తొలగించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించిన విమానయాన సిబ్బందిని ముందుగా డ్రగ్స్‌ రిహాబ్ సెంటర్‌కు పంపుతారు. రెండోసారి పరీక్షలో ఫెయిల్ అయితే మూడేళ్లపాటు సస్పెన్షన్‌ విధిస్తారు. ఇది మూడోసారి విఫలమైతే లైసెన్స్ రద్దవుతుంది.