Home Page SliderTelangana

వామ్మో..! కోటి బీర్లు తాగేశారా?

హైదరాబాద్‌ మహనగరంలో బీర్ ప్రియులు ఎక్కువైపోయారు. కాగా ఏప్రిల్ నెల నుంచి హైదరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాలో బీర్లు విపరీంతగా అమ్ముడుపోతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో కలిపి రోజుకు 6 లక్షల బీర్లు సేల్ అవుతున్నాయి. కాగా  ఈ 17 రోజుల్లోనే నగరవాసులు 1.01కోట్ల బీర్లు తాగేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా హైదరాబాద్,మేడ్చల్ జిల్లాల కంటే ముందంజలో ఉంది.  కాగా రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో బీర్ల అమ్మకాలు పెరిగినట్లు కన్పిస్తోంది.