హమ్మయ్య ఎట్టకేలకు ఖాతా తెరిచిన ఆప్
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన గజయ్ సింగ్ రాణాపై 4538 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

