పార్టీ మారడం లేదు. క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
లేడి అమితాబ్ విజయశాంతి పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చింది. త్వరలో విజయశాంతి కూడా పార్టీ మారబోతుందంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కన్పిస్తోంది. గతంలో మెదక్ ఎంపీగా విజయం సాధించిన తర్వాత, విజయశాంతి మరోసారి విజయం సాధించలేదు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. ఐతే బీజేపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జరుగుతోంది. ఐతే సినిమా లెక్కన ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాల్లో సాధ్యం కాదని పేర్కొన్నారు. కొందరు తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్నారని, మరికొందరు బీజేపీలోనే ఉండాలని చెబుతున్నారని ఆమె ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఐతే రాజకీయం వేరు, సినిమా వేరని ఆమె స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ దుర్మార్గాల నుండి తెలంగాణ ప్రజలను కాపాడుకోనీకి కాంగ్రెస్ నుండి పోరాడాలి…
— VIJAYASHANTHI (@vijayashanthi_m) November 1, 2023
7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు..
బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం… pic.twitter.com/7S9GdxV6d4