NewsTelangana

నేతల కంటే పార్టీయే ముఖ్యం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ స్పందించారు. తాను సోనియా గాంధీకి మాత్రమే ఏజంటేనని, మరెవరికీ ఏజెంట్‌ను కానని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్‌ కెప్టెన్‌ మాత్రమేనని, నేతల కంటే పార్టీయే ముఖ్యమని ఉద్ఘాటించారు. తెలంగాణ పరిస్థితులను సోనియా, రాహుల్‌, ప్రియాంక తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా ప్రియాంక గాంధీ వస్తే సంతోషమేనన్నారు. తాను కాంగ్రెస్‌ హైకమాండ్‌, రాష్ట్రానికి మధ్య వారధి లాంటి వాడినని మాణిక్యం ఠాగూర్‌ వెల్లడించారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి నాకు మంచి మిత్రుడు. ఇంటికి పిలిచి మరీ బిర్యానీ పెట్టాడు. బీజేపీలో చేరిన వాళ్లే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు మాణిక్యం ఠాగూర్‌.