ఇదెక్కడి దారుణం -టీచర్‌ను తరిమి తరిమి కొట్టిన తల్లిదండ్రులు
చదవకపోతే టీచర్లు విద్యార్థులను మందలించడం మామూలే. తమ ఏడేళ్ల కుమార్తెను కొట్టాడని, తల్లిదండ్రులు టీచర్‌ను చితకబాదిన సంఘటన మాత్రం విచిత్రమే. తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పిల్లలను కొట్టే హక్కు ఎవరిచ్చారంటూ ఉద్రేకంతో ఊగిపోతూ తండ్రి టీచర్‌ను కొట్టడం వైరల్‌గా మారింది. క్లాస్‌లో శ్రద్ధగా వినడం లేదంటూ సీటు మార్చారని, ఆసమయంలో క్రింద పడిన విద్యార్థినిని కొట్టాడని, చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. టీచర్ ఈ ఆరోపణను అంగీరించలేదు. దీనితో ఆగ్రహం చెందిన పేరెంట్స్, టీచర్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

