31 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌కి ఒరిజినల్ చంద్రముఖి సిద్ధం
మన ఇండియన్ సినిమా దగ్గర హర్రర్ సినిమాలలో కొన్ని సినిమాలకి సెపరేట్ క్రేజ్ ఉంటుందనే చెప్పాలి. మరి వీటిలో అయితే మూవీ లవర్స్ “చంద్రముఖి” అనే సినిమా అంటే ఇట్టే గుర్తు కొస్తుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ అలాగే జ్యోతికల కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తమిళ్ భాషతో సహా తెలుగులో కూడా భారీ హిట్ అయ్యింది. కానీ ఈ చిత్రం ఒరిజినల్ కాదు దీన్ని కన్నడ మాతృక చిత్రం “ఆప్తమిత్ర”కి రీమేక్ చేయబడిందని చాలామందికి తెలుసు. కానీ… ఇది కూడా ఒక రీమేక్ అని చాలా తక్కువ మందికి తెలిసు. మరి అసలు ఆ ఒరిజినల్ చంద్రముఖి ఎవరు? ఎక్కడ నుంచి పుట్టింది అంటే ఇది మొట్టమొదటగా మళయాళ భాషా చిత్రం నుంచి పుట్టింది. స్టార్ హీరో మోహన్‌లాల్ అలాగే నటి శోభన కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే “మణిచిత్రతాజు”. ఎప్పుడో 1993 లో దర్శకుడు ఫాజిల్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచే చంద్రముఖి, ఆప్తమిత్ర ఇలా ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో కొత్త సినిమాలుగా రీమేక్ చేయబడ్డాయి. మరి ఇప్పుడు ఫైనల్‌గా అసలు సిసలైన చంద్రముఖి రీ రిలీజ్‌కి రావడానికి సిద్ధం అయ్యింది. 4కే లో అప్‌డేట్ చేసి డాల్బీ ఎట్‌మాస్ మిక్స్‌తో 31 ఏళ్ల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్‌కి సిద్ధమౌతోంది. అయితే ఇంకా డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ కాలేదు కానీ ఒరిజినల్ సినిమాని చూడాలి అనుకునేవారు మాత్రం డేట్ కోసం వేచియుండాలి.