స్టైల్‌లో ఏకైక భారతీయ నటుడు.. రజనీకాంత్ పుట్టినరోజు..
ప్రముఖ నటుడు రజనీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విశేషాలు తెలుసుకుందాం. హ్యాపీ బర్త్ డే తలైవార్ స్టైల్‌గా నడుస్తూ సిగరెట్ వెలిగించడం.. కళ్లజోడు పెట్టుకోవడం.. జుట్టు తిప్పడం.. ఇలా తెరపై రజనీకాంత్ ఏదిచేసినా కళ్లు అప్పగించడమే ప్రేక్షకుల వంతవుతుంది. నా దారి.. రహదారి అని ఆయన ఒక్కసారి చెప్పినా వందసార్లు మార్మోగుతుంది. నటుడిగా ఎన్నోఅవార్డులు -రివార్డులు అందుకున్న ఈ అగ్రహీరో వ్యక్తిగా ఎలా ఉంటారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే! నేడు ఆయన పుట్టినరోజు..