NewsTelangana

మునుగోడులో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

మునుగోడులో వరుసగా మూడోరోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 32 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే ఈ రోజు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ తన నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. ఈ మేరకు ఈ నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. దీంతో మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేటిఆర్‌కు బుకేలు ఇస్తూ..టపాసులు కాలుస్తూ..అక్కడ కోలాహలం చేశారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ మరి కాసేపట్లో తన నామినేషన్ పత్రాలను చుండూర్ తహశీల్దార్‌కు అందచేయనున్నారు. ఇప్పటికే ఈ ఉపఎన్నికల కోసం 32 మంది అభ్యర్థులు 52 సెట్ల నామినేషన్ పత్రాలను అందించినట్లు సమాచారం.