Home Page SliderNational

ఢిల్లీలో కొనసాగుతున్న బీజేపీ నేతల కీలక సమావేశం

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ ఢిల్లీలో మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించింది. కాగా దేశవ్యాప్తంగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇవాళ ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు,జాతీయ కార్యదర్శులు,రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ హైకమాండ్ పార్టీ సంస్థాగత బలోపేతం,ఎన్నికల సన్నద్ధతపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు,ఐదు రాష్ట్రాల ఎన్నికలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు బీజేపీ నేతలకు హైకమాండ్ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో బీజేపీ పార్టీ అలర్ట్ అయ్యింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంలో..పునరావృతం కాకుడదనే ఉద్దేశ్యంతో బీజేపీ ముందుకెళ్తున్నట్లు కన్పిస్తోంది.అయితే బీజేపీ కీలక సమావేశం ఇవాళ ఉదయం ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.