Home Page SliderTelangana

తమ్ముడి మృతి తట్టుకోలేక.. ఆగిన అక్క గుండె..

మృత్యువులోనూ ఆ రక్త సంబంధం వీడలేదు. తమ్ముడి మృతి తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది. తాటిపల్లి గ్రామానికి చెందిన పిల్లి జలపతి (60) అనారోగ్యంతో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన అతడి సోదరి చింత రాజవ్వ (70) తమ్ముడి మృతదేహం వద్ద రోధిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.