నిప్పుల కొలిమిలా ఉత్తరాది రాష్ట్రాలు..నీటిఎద్దడితో విలవిల
ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు, ఇతర ఉత్తరాది రాష్ట్రాలు కొన్ని విపరీతమైన ఎండల వేడిమికి నిప్పుల కొలిమిలా తయారయ్యాయి. దానికి తోడు నీటి ఎద్దడితో విలవిలలాడుతున్నాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆయా రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి కరువు కూడా ఏర్పడింది. యమునా నదీ జలాల కోసం ఇప్పటికే హర్యానాతో ఢిల్లీ కోర్టుకెక్కింది. మిగులు నీటిని విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు కూడా ఇటీవల ఆదేశించింది.

