Home Page SliderInternational

ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఇటీవల కాలంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు.కాగా మొన్నటివరకు ట్రంప్ అమెరికా సున్నిత సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. అదేంటంటే ట్రంప్ నేవీ సబ్‌మెరైన్స్ ,న్యూక్లియర్ వార్ హెడ్స్ సంఖ్య ,రష్యా నౌకలు ఎంత త్వరగా చేరుకోగలవు అనే సమాచారాన్ని ఆస్ట్రేలియా బిలియనీర్ ఆంథోని సహ పలువురు స్నేహితులకు అందించినట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ తాజాగా వెల్లడించింది. దీంతో ఈ ఆరోపణలపై బైడెన్ ప్రభుత్వం ట్రంప్‌ను విచారణకు ఆదేశించే అవకాశాలు కన్పిస్తున్నాయి.