ఆవకాయ పచ్చడితో చింతమనేని సందడి
మహానాడులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవకాయ పచ్చడితో సందడి చేశారు. గత ప్రభుత్వం చేసిన అరాచకానికి ఆవకాయ పచ్చడితో సమాధానం అంటూ మహానాడులో 2లక్షల మందికి సరిపడా ఆవకాయ పచ్చడి స్వయంగా తయారు చేయించారు. కడపకు ప్రత్యేక వాహనంతోపాటు, పదమూడు వేల మామిడి కాయల లోడుతో వచ్చి, స్వీట్లతో పాటు నోరూరించే నాన్ వెజ్ వంటకాలూ దగ్గరుండి వండించే బాధ్యత తీసుకున్నారు.

