రాందేవ్ బాబాని తలపిస్తున్న స్టార్ హీరో కొత్త లుక్
ప్రముఖ స్టార్ హీరో ధనుష్ తన కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. కాగా ఆయన ఇటీవల విడుదలైన సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రస్తుతం తన కొత్త సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో ధనుష్ తాజాగా డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. ఆయన గుబురు గడ్డం,మీసాలతో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చారు. దీంతో హీరో ధనుష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లుక్‌లో హీరో ధనుష్ రాందేవ్ బాబాలాగా కన్పిస్తున్నారని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.