తెలంగాణకు రానున్న కొత్త గవర్నర్
తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. మరో రెండు రోజుల్లో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆయన గతంలో త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాద పూర్వకంగా రాజ్‌భవన్‌లో కలిసారు.

