అత్యాచార ఘటనపై మహిళా జాతీయ కమిషన్ సీరియస్
టిజి: హైదరాబాద్ మియాపూర్‌లో యువతిపై జరిగిన అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాను ఆదేశిస్తూ ఎన్‌సీడబ్ల్యూ లేఖ రాసింది. బాధితురాలికి ఉచితంగా మెరుగైన వైద్య పరీక్షలు అందించాలని.. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.