గడువులోగా పురపాలక ఎన్నికలు అనుమానమే!
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు గడువులోగా నిర్వహించడం ప్రశ్నార్థకంగా మారింది. పలు చిక్కుముడులు వీడితే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా మిగిలిన 142 పురపాలక సంఘాలకు వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే జనవరి నుండి కొంతకాలం పాటు ప్రత్యేకాధికారుల పాలన తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.