Home Page SliderTelangana

పెద్దపులి కలకలం

ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, సాయంత్రం త్వరగా ఇండ్లకు చేరుకోవాలని సూచించారు.