కన్నీళ్లు పెడుతున్న తెలంగాణ తల్లి
కాంగ్రెస్ తల్లి వల్ల తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటుందని బీఆర్ ఎస్ నేతలు కేటిఆర్,కవితలు వ్యాఖ్యానించారు. ఈనెల 9న తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేయనున్న నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుని తమ పార్టీ ,తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.సీఎం రేవంత్ దుశ్చర్యల కారణంగా ఉద్యమ తల్లిగా ఇన్నాళ్లు భాసిల్లిన తెలంగాణ తల్లి రోదిస్తుందన్నారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చే హక్కు కాంగ్రెసోళ్లకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.తెలంగాణ సంస్కృతిపై కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విధ్వంసానికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఇంటా బయటా తెలంగాణ తల్లి వ్యవహారం రాద్దాంతంతో సమావేశాలు కూడా వేడెక్కిపోతున్నాయి.

