పుష్ప-2లో అదరగొట్టే ఐటెం సాంగ్-రెమ్యూనరేషన్ ఎంతంటే…
పుష్ప 2 నుండి ఎప్పుడెప్పుడు అప్‌డేట్ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఈ చిత్రంలో కూడా ఒక అదరగొట్టే ఐటెం సాంగ్ రాబోతోందట. పుష్ప చిత్రంలోని సమంత చేసిన ‘ఊ అంటావా మావా’ పాటకు డాన్స్ చేయని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతగా మాయ చేసిన ఆ పాట స్థానంలో మరో అదిరిపోయే మాస్ మసాలా సాంగ్ రావాల్సిందేనంటున్నారు ప్రేక్షకులు. అందుకే ఈసారి బాలీవుడ్ నుండి హీరోయిన్‌ను దించారు డైరక్టర్ సుకుమార్. వాల్తేర్ వీరయ్యలో ‘వేరీజ్ ద పార్టీ’ అంటూ చిందులేసిన ఊర్వశి రౌతాలానే పుష్ప 2లో కూడా ఆడి పాడబోతోందట. ఈ పాట కోసం ఆమె అడిగిన పారితోషకం వింటే అమ్మో అంటారు. అప్పట్లోనే సమంతకు ఈ పాటకు ఐదు కోట్లిచ్చారని వినికిడి. ఇప్పుడు ఊర్వశి అంతకన్నా ఎక్కువే డిమాండ్ చేస్తోందట. కనీసం ఆరేడు కోట్లు ఆమెకు ఆఫర్ చేసినట్లు సమాచారం.

