Home Page SliderNational

ముంబైలో అత్యంత ఖరీదైన గణపతి నిమజ్జనం

జీఎస్‌బీ సేవా మండలి రూపొందించిన దేశంలోనే ఖరీదైన వినాయకుని నిమజ్జనం పూర్తయ్యింది. ఈ గణేషుడు ప్రపంచంలోనే రిచ్చెస్ట్ గణపతిగా పేరుగాంచారు. ఆ గణపతి ప్రతిమకు 66కేజీల బంగారు ఆభరణాలు, 325 కేజీల వెండి ఆభరణాలను అలంకరించారు. ఈ గణేష మండపానికి రూ. 400 కోట్ల ఇన్సూరెన్స్‌ను చేయించినట్లు సమాచారం. గణేష నవరాత్రులలో ఐదవరోజైన గురువారం ఈ వినాయకుని నిమజ్జనం జరిగింది. గత ఐదురోజులుగా ఘనంగా పూజలు నిర్వహించారు. నేడు శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. సముద్రంలో నిమజ్జనం చేసేవరకూ 66 కిలోల బంగారు ఆభరణాలను విగ్రహానికే ఉంచడం విశేషం. నిమజ్జన ప్రదేశంలో ఆభరణాలను తొలగించి సముద్రంలో గణపతిని సాగనంపారు.