Andhra PradeshHome Page Slider

అసెంబ్లీకి మత్స్యకారుడి వేషధారణలో వచ్చిన ఎమ్మెల్యే

ఏపీలో నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకి సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తోపాటు ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నారాయణ నాయకర్ అందరి దృష్టిని ఆకర్షించారు.ఎందుకంటే ఆయన అసెంబ్లీకి మత్సదారుడి వేషధారణలో వచ్చారు. అయితే ఓ చేతిలో చేప,మరో చేతిలో వలను పట్టుకొని తమ సామాజిక వర్గ వృత్తిని ప్రతిబింబించేలా కనిపించి ఆకట్టుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన 49 వేల పైచిలుకు మెజార్టీతో నరసాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో కూడా జనసేన నుంచి పోటీచేసిన బొమ్మిడి నారాయణ నాయకర్ 49,120 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.