Andhra PradeshHome Page Slider

భోగి మంటల చుట్టూ స్టెప్పేసిన మంత్రి

ఇప్పుడు సోషల్ మీడియో పుణ్యమా అని ప్రతి ఒక్కరూ సెలబ్రెటీ అయిపోతున్నారు. ఇంతకు ముందు ఎవరైనా టీవీల్లో, సినిమాలలో నటించేవారే అందరికీ తెలిసుంటారు. ఇప్పుడు రాజకీయనాయకులు కూడా నటులతో సమానంగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మల్యేలు కూడా తక్కువేమీ కాదు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన భోగి వేడుకల్లో పాల్గొనడమే కాక తీన్‌మార్ స్టెప్పులు వేస్తూ అందర్నీ హుషారెత్తించారు. తాను చలి కాచుకోవడానికి రాలేదని, డాన్స్ చేస్తానని, ఫాస్ట్ బీట్ సాంగ్ పెట్టమని కోరారు. గిరిజన మహిళలతో కలిసి భోగి మంటల చుట్టూ స్టెప్పులు వేశారు.