భుజంపై చెయ్యేసినందుకు రాజీనామా చేసిన మంత్రి
ఒక చర్చలో భాగంగా తన సిబ్బంది భుజంపై చెయ్యి వేసినందుకు న్యూజిలాండ్ వాణిజ్య వ్యవహారాల మంత్రి ఆండ్రూ బేలీ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ వ్యవహారంపై ఆయన క్షమాపణలు చెప్పారు. చర్చలో బాగా లోతుగా వెళ్లినందున చూసుకోకుండా సిబ్బంది భుజంపై చేయి వేశానని, తప్పయిందని, దానిని ఒప్పుకుంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్యపై ఆయనపై కేసు కూడా నమోదయినట్లు సమాచారం. సిబ్బంది ఒకరు ఈ విషయంపై కంప్లైంట్ చేశారు. ఆ సమయంలో మంత్రి మద్యం సేవించి వచ్చారని, తనను లూజర్ అని దూషించారని తన భుజంపై చేయి వేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తాను అలా చేసి ఉండకూడదని తప్పును అంగీకరించారు. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినా, ఎంపీగా కొనసాగుతున్నట్లు తెలిపారు.

