Home Page SliderInternational

మిల్టన్ ప్రభావం..హరికేన్‌లో చిక్కుకున్న విమానం

మిల్టన్ హరికేన్ అమెరికాపై విరుచుకుపడుతోంది. ఈ హరికేన్ ప్రభావానికి ఒక పరిశోధక విమానం దీనిలో చిక్కుకుపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ విమానంలోని నలుగురు పరిశోధకులు శ్రమించి విమానాన్ని మరోవైపుకు తీసుకెళ్లగలిగారు. తుపాన్ ధాటికి విమానం తీవ్ర కుదుపులకు లోనయ్యింది. దీనితో వస్తువులన్నీ చెల్లాచెదరుగా పడిపోయాయి. ఫ్లోరిడాలో ఈ మిల్టన్ ప్రభావంతో గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రచండగాలులు వీస్తున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ వందేళ్లలో అమెరికాలో ఇది భయంకర తుఫాన్ అని పేర్కొన్నారు.