home page sliderHome Page SliderTelangana

నిఘా నీడలో మహానగరం

ఓ వైపు ఆపరేషన్ సిందూర్, మరోవైపు మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్ లోని కీలక రక్షణ రంగ సంస్థల వద్ద భద్రతను పెంచారు. మరోవైపు మిస్ వరల్డ్ పోటీల కోసం అతిథులు విదేశాల నుంచి హైదరాబాద్ కి విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలతో భారీ భద్రతను పెంచారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భద్రతా ఏర్పాట్లను కమిషనర్ సీవీ ఆనంద్ మానిటరింగ్ చేస్తున్నారు.