Home Page SliderTelangana

మళ్లీ మొదలైంది మంచు ఫ్యామిలీ వివాదం..

హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంచు మనోజ్ ఆందోళనకు దిగారు. తన కూతురు బర్త్ డే వేడుకలకు రాజస్థాన్‌కు వెళ్లగా.. తన ఇంట్లోని కారు, వస్తువులను అపహరించారని మనోజ్ ఆరోపించారు. మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదని చెప్పారు. దీంతో జల్‌పల్లి ఇంటి గేటు వద్ద మనోజ్ బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో మోహన్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో పోలీసులు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు.