కియారాపై అదిరే పోస్టర్‌ని రిలీజ్ చేసిన “గేమ్ ఛేంజర్” మేకర్స్
గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. భారీ అంచనాలు ఉన్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత చిత్రం “భారతీయుడు 2” తో శంకర్ డిజప్పాయింట్ చేయడంతో ఇక అందరి దృష్టి గేమ్ ఛేంజర్ మీదనే పడింది.
ఇక ఈ చిత్రం విషయంలో మేకర్స్ రీసెంట్‌గానే అప్‌డేట్స్ కూడా ఇవ్వడం మొదలు పెట్టగా ఇప్పుడు మరో అప్‌డేట్‌ని అందించారు. ఈ చిత్రంలో నటిస్తున్న ఒక హీరోయిన్ కియారా అద్వానీపై ఒక బ్యూటిఫుల్ పోస్టర్‌ని శంకర్ మార్క్‌లో రిలీజ్ చేశారు. నేడు కియారా పుట్టినరోజు కానుకగా తమ జాబిలమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా మేకర్స్ ఆమెపై పోస్టర్ రిలీజ్ చేశారు. మరి ఇందులో కియారా ఎంతో అందంగా కనిపిస్తుండగా ఆమె డ్రెస్సింగ్, బ్యాక్‌గ్రౌండ్‌లోని విజువల్స్ అదిరిపోయాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

