Home Page SliderNational

ఎంపీని అనర్హుడిగా ప్రకటించిన లోక్ సభ సెక్రటేరియట్

లక్షద్వీప్‌కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యునిగా అనర్హుడని లోక్‌సభ సెక్రటేరియట్ వెల్లడించింది. ఎమ్మెల్యే, మరో ముగ్గురికి హత్యాయత్నం కేసులో కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో లోక్ సభ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కవరత్తిలోని జిల్లా సెషన్స్ కోర్టు ఎన్‌సిపి ఎంపి, ఇతర నిందితుల బెయిల్‌ను సస్పెండ్ చేసింది. నిందితులను కేరళలోని కన్నూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ శిక్షను వ్యతిరేకిస్తూ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

ప్రాసిక్యూషన్ ప్రకారం, మాజీ కేంద్ర మంత్రి పిఎమ్ సయీద్ అల్లుడు కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ సలీహ్‌పై వాగ్వాదం జరిగిన తరువాత దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వ్యక్తుల గుంపును ఎంపీ నడిపించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఘటన తర్వాత ఎంపీ ఫైజల్‌తో పాటు మరికొందరిపై భారత శిక్షాస్మృతి కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో దివంగత కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీఎం సయీద్ అల్లుడు మహ్మద్ సలీహ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినందుకు కవరత్తి సెషన్స్ కోర్టు దోషులకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున జరిమానా విధించింది.

కేసులో దోషులంతా సలీహ్‌కు బంధువులు కావడం విశేషం. ఈ కేసులో 32 మంది నిందితులు ఉండగా మొదటి నలుగురికి శిక్ష పడింది. ఈ కేసులో ఎంపీ రెండో నిందితుడిగా ఉన్నారు. నిందితుల తరఫు న్యాయవాది ఇది చిన్న గొడవ అని నొక్కిచెప్పినప్పటికీ, వైద్య నివేదికలు, బాధితుడు చాలా కాలం ఆసుపత్రిలో ఉండటం వల్ల న్యాయమూర్తి వారి వాదనను తిరస్కరించారు. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ ఘర్షణ జరిగింది.