తాజాగా ఒక గుడ్డు ధర రూ.32 పాకిస్తాన్‌లో
పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పౌష్టికాహారం కోసం ఒక్క గుడ్డు కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా ఒక గుడ్డు ధర రూ.32 కు చేరింది. దీంతో గుడ్లు కొనాలంటే ఆ దేశ ప్రజలు భయపడిపోతున్నారు.