Home Page SliderNational

బిర్యానీని అల్లు అర్జున్‌తో పోల్చిన KKR టీమ్

ఈ IPL-16 సీజన్‌లో ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. కాగా గత రాత్రి గుజరాత్ Vs పంజాబ్ మ్యాచ్ నరాలు తెగ ఉత్కంఠ నడుమ సాగింది. అయితే చివరికి గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్‌లో గెలుపొంది మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రోజు రాత్రి SRH Vs KKR మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో KKR టీమ్ ఆసక్తికర ట్వీట్ చేసింది. తమ ప్రత్యర్థి టీమ్‌ను ఉద్దేశిస్తూ..”హే సన్ రైజర్స్..బిర్యానీ పట్ల మనకున్న ప్రేమను పంచుకుందాం. మీకు సినిమాల్లో అల్లు( అల్లు అర్జున్) అంటే ఎంత ఇష్టమో..మాకు బిర్యానీలో ఆలు అంత ఇష్టమని” పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సివుంది. కాగా ఈ IPL-16 సీజన్‌లో ఇప్పటికే KKR రెండుసార్లు గెలిచిన విషయం తెలిసిందే.