కన్నడ తీర్పు కాంగ్రెస్ వైపు దూసుకెళ్తున్న వేళ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కాగా ఈ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే ఈ ఉత్కంఠకు నడుమ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ 113ని ఎప్పుడో దాటేసింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు కర్ణాటకలో సెంటిమెంటల్ నియోజకవర్గం రోన్‌లో సైతం కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. ఈ రోన్‌లో గెలిచినవారే కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తుంది.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ కూడా లీడ్‌లో ఉండడంతో..కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుదంని కర్ణాటక ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచాయి. దీంతో వారు ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

