‘కల్వకుంట్ల కుటుంబం కొత్తసినిమా చూపిస్తోంది’.. యెన్నం
తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కొత్త సినిమా చూపిస్తోందంటూ ఎద్దేవా చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత విషయాలు రచ్చకెక్కడంపై ఆయన మాట్లాడారు. కవిత వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కామెంట్లు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గొంతులను కొడుకు, బిడ్డలు కోశారని, అందులో కవిత పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ఎంతో మంది రాజకీయ జీవితాలతో ఆడుకున్న కుటుంబం అంటూ విమర్శలు గుప్పించారు. సొంత కుటుంబాన్ని కంట్రోల్ చేయలేని వ్యక్తి కేసీఆర్ తెలంగాణను మళ్ళీ ఎలా పాలిస్తారని ప్రశ్నించారు. పాలనకు కేటీఆర్ అనర్హుడని కవిత చెబుతోందన్నారు. కేసీఆర్ అధికారం కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను మరోసారి అధికారంలో కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పనికిరాని ప్రాజెక్టులు కట్టి, అప్పులను ప్రజలపై రుద్దారని మండిపడ్డారు.