పాక్‌లో ముదురుతున్న ఇంటిపోరు..
పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ దాడులతో ఒక పక్క ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే మరోపక్క ఇంటిపోరుతో సతమతమవుతోంది. తాజాగా పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వంపై తిరుగబాటుకు తెగబడ్డారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్లపై ర్యాలీలు చేస్తూ ఆయనను విడుదల చేయాలని నినాదాలు చేస్తున్నారు. ఆయన అభిమానులు లాహోర్‌లో ఆందోళనలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలతో ఆయనను, ఆయన భార్యను జైలులో ఉంచిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వానిదే తప్పని, సైన్యం కావాలనే భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడిందని దానివల్లే యుద్ధవాతావరణం ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. అక్కడి ఆర్మీ క్యాంపులకు కూడా సరైన దిశా నిర్ధేశం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పాక్ ప్రధాని కనిపించడం లేదనే వార్తలు వస్తున్నాయి.