Home Page SliderNational

మరికొన్ని గంటల్లో స్వదేశానికి భారత జట్టు

భారతజట్టు హరికేన్ కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే భారతజట్టు మరికొన్ని గంటల్లోనే స్వదేశానికి రానున్నట్లు తెలుస్తోంది.కాగా బీసీసీఐ ఆటగాళ్లు,సిబ్బంది కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే వీరితో పాటు 20 మందికి పైగా మీడియా సిబ్బంది వచ్చేందుకు బీసీసీఐ సెక్రటరీ జైషా అనుమతించినట్లు సమాచారం. దీంతో మీడియా వారు జైషాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా వీరంతా రేపు ఉదయానికి ఢిల్లీ చేరే అవకాశముందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. భారతజట్టు T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత తొలిసారి స్వదేశంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు టీమిండియాకు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.