భారత సైన్యం బలమైనదే.. ప్రభుత్వమే బలహీనమైనది…
సరిహద్దుల వద్ద చైనా ఆగడాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తవాంగ్ ఘటనపై పార్లమెంట్‌లో చర్చపెట్టాలని లేదంటే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏం చేయబోతున్నదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సరిహద్దులో భారత సైన్యం బలంగా ఉన్నదని, కానీ వారికి మద్దతు నిలువడంలో ప్రభుత్వం మాత్రం బలహీనంగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. చైనా సేనలు భారత భూభాగంలోకి వచ్చినా… ఎవరూ రాలేదంటూ ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అసదుద్దీన్ ఆరోపించారు. చైనా సైనికులు దెప్సాంగ్, దెమ్‌చోక్‌లను ఆక్రమించినట్లుగా శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయని ఒవైసీ పేర్కొన్నారు.