గిన్నిస్ రికార్డు సాధించిన ‘హ్యుందాయ్’ కారు
‘హ్యుందాయ్ ఐకానిక్ 5’ విద్యుత్ ఎస్‌యూవీ కారు అత్యంత ఎత్తైన ప్రదేశంలో ప్రయాణించిన కారుగా ఘనత వహించింది. లేహ్ లద్దాఖ్‌లోని ఉమ్లింగ్ లా(5,802 మీటర్లు) ఎత్తు నుండి కేరళలోని కుట్టనాడ్ (5799 మీటర్లు) ఎక్కుకు ప్రయాణించి ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ కారును ఎవో ఇండియాకు చెందిన నిపుణుల బృందం నడిపారు. వారు పలు రకాల రహదారులు, వాతావరణ పరిస్థితులలో దాదాపు 5 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ రికార్డును సాధించారు. ఈ విషయంలో ఎంతో గర్వంగా ఉందని హ్యుందాయ్ మోటార్ ఎండీ అన్‌సూ కిమ్ పేర్కొన్నారు.

