Home Page SliderNational

RRR ను మించి నెట్‌ఫ్లిక్స్‌లో వ్యూస్ రికార్డు సాధించిన హిందీ మూవీ

ఆస్కార్ విన్నర్ RRR రికార్డును మించి వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పిందో హిందీ మూవీ. యామీగౌతమ్, సన్నీ కౌశల్ ముఖ్యపాత్రల్లో నటించిన చోర్ నికల్ కే భాగ్ చిత్రం నేరుగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఈ చిత్రం రెండు వారాల్లోనే 29 మిలియన్ గంటలను సాధించి, రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకూ RRR పేరిట ఉన్న 25 మిలియన్ అవర్స్ రికార్డును అధిగమించింది. మూడవస్థానంలో అలియాభట్ నటించిన గంగూబాయి కాఠియావాడి చిత్రం 22 మిలియన్ గంటలతో నిలిచింది.  ఈరోజుల్లో ఓటీటీలోనే అందరూ సినిమాలు చూసేస్తున్నారు. థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. వెబ్ సిరీస్‌లను, షార్ట్ ఫిలింలను కూడా ఆదరిస్తున్నారు. మంచి సినిమా అయితే భాష రాకపోయినా సబ్ టైటిల్స్ సహాయంతో చూస్తున్నారు.