Andhra PradeshHome Page Slider

జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేసిన హైకోర్టు

జీవో నెంబర్ 1ను సస్పెండ్ ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈనెల 23 వరకు జీవో నెంబర్ 1పై సస్పెండ్ చేస్తున్నట్టు కోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కారును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 20కి కోర్టు వాయిదా వేసింది. సీపీఐ నేత రామకృష్ణ వేసిన పిటిషన్‍‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. జీవో విషయంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ నేడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అశ్వని కుమార్ వాదించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులను కాలరాసేలా జీవో ఉందని, ఈ జీవోను కొట్టివేయాలని సిపిఐ రామకృష్ణ హైకోర్టును కోరారు. దీనితో వాదనలను విన్న హైకోర్టు ఈనెల 23వ తేదీ వరకు జీవోపై సస్పెండ్ విధించింది .ఈ సందర్భంగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇటువంటి జీవో ఎప్పుడైనా ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. 1861 నాటి ఈ చట్టం బ్రిటిష్ వారు కూడా ఉపయోగించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. బ్రిటిష్ వారు ఈ చట్టాన్ని ఉపయోగించి ఉంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా అని ప్రశ్నించింది. గతంలో ఇటువంటి జీవోపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ న్యాయవాది అశ్విని కుమార్ హైకోర్టు ముందు ఉంచారు. మనం ఏ సమాజంలో ఉన్నాము అర్థం కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానిచ్చింది.